యవ్వ నస్థులకు హెచ్చరికగా మారిన స్త్రీ:-
ఆమె ఒక్కగానేనొక్క కుమార్తె , పండ్రెండు అన్నాదములకు ఒక్కగానేనొక్క చెల్లి ,గారాలపట్టి. దీనా అను పేరుకు అర్ధం నాయ్యమైన తీర్పు అని అర్ధం. యాకోబు లేయాల ఏకైక పుత్రిక దీనా . ఒక్కగానొక్క ఆడపిల్ల , మంచి అందగత్తె తన జీవితాన్ని చేతులారా నష్టపరచుకొన్న యవ్వన స్త్రీ స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి ,యవనెచ్చలకు లొంగిపోయి తన హద్దులను అతిక్రమించి లోకముచేత ఆకర్షించబడిన యవ్వనస్థురాలు.
1.కుటుంబములో అపశ్రుతి
2.తండ్రి తప్పిదం
3.పెంపకంలో లోపం
4.అనవసర విషయాలలో ఆసక్తి
5.స్వేచ్ఛను కోరి నష్టము
6. లొంగిపోయిన దీనా
7.అన్నలను హంతకులుగా మారుట
8.నిర్దోషుల రక్తపాతం
9.తల్లిదండ్రులు, అన్నలను గాయపరిచిన దీనా
కుటుంబములో అపశ్రుతి:-
కుటుంబములోని పరిస్థితులు పిల్లలపైనా ప్రభావమును చూపిస్తుంది. దీనా తల్లీ అయినా లేయా తన భర్త ప్రేమ కోసం తపించడము తండ్రియైన యాకోబు చేత తన తల్లీ నిరాదరించబడటం. పినతల్లియైన రాహేలును యాకోబు అధికముగా ప్రేమించడము తన పైన ఎంతో ప్రభావము చూపించింది. లేయా గర్భవతియైన ప్రతిసారి తన భర్త నుండి ప్రేమను ఆశించేది. ఆదికాండము 29:31-35 వచనములు మనము చూడవచ్చు. భర్త ప్రేమను ఆశించిన తన తల్లి నిర్లక్ష్యానికి గురికావడము. దీనా గమనించింది. దీనిని ప్రభావము దీనా ఫై ఎంతగానో వుంది.
తాను యుక్త వయస్సుకు వచ్చాక దీని విషయమే ఎక్కువ ఆలోచించి వుండవచ్చు. తనను కోరుకొని వ్యక్తిని తనెంత మాత్రం వివాహము చేసుకోరాదని. తన్ను ప్రేమించే వ్యక్తినే వివాహము చేసుకోవాలి అని తీర్మానించుకోని ఉంటుంది. దేశాన్ని చూడటానికి వెళ్ళిన దీనాను ఆ దేశము నేలిన హామోరు కుమారుడగు షేకేము చూసాడు. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు.”ఆమెను చూచి పట్టుకొని,ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను” (34:2)అంతేకాదు. “షెకెము అను నా కుమారుడు మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి.”
అని అతని తండ్రి కూడా అన్నాడు. దీనా అన్నలు వేశ్య యెడల జరిగించునట్లు మా సహోదరి యెడల ప్రవర్తింపవచునా”(ఆదికాండము 34:31)అని ఎంతో బాధపడ్డారు. అయితే దీనా అంతగా భాధపడినట్లు కనపడదు.
మన కుటుంబ పరిస్థితులు పిల్లలు గమనిస్తూ ఉంటారు. తాము పెరిగిన పరిస్థితులు తమపై తప్పక ప్రభావము చూపుతాయి. ప్రియా సహోదరి ,సహోదరులు ,తలిదండ్రులు మన ప్రవర్తనను,ప్రతి అడుగును పిల్లలు గమనిస్తూనే ఉంటారు . వారు తమ హృదయములలో కొన్ని అభిప్రాయాలూ ఏర్పరచుకొంటారు. మన ప్రవర్తన విషయములో జాగ్రత్తపడదాం. తనను ప్రేమించని యాకోబు వల్ల లేయా అనుభవించిన భాద దీనా హృదయములో ముద్రవేసింది. అందుకే దీనా తనతో ప్రీతిగా మాట్లాడిన షెకెముకు లొంగిపోయిoది. మన బలహీనతలు,మన ప్రవర్తన వల్ల మన పిల్లలు భ్రష్ట్టులైపోకుండునట్లుగా ప్రభువులో మనల్ని మనం సరిచేసుకొందాం.
తండ్రి తప్పిదం :-
దేవుని పిలుపుతో లాబాను ఇంటినుండి బయలుదేరిన యాకోబు “బేతేలు”కు వెళ్ళాలి ఆదికాండము 34:13అయితే యాకోబు ఏశావుతో సమాధానపడక బేతేలుకు త్వరగా వెళ్ళాలనే ఆసక్తి చూపించలేదు. తన అన్నయైన ఏశావు హృదయాన్ని దేవుడు కరిగించాడు. ఏశావు గురించిన భయము హృదయములో ఉన్నoతాకాలం యాకోబు ప్రయాణం త్వరగా సాగింది. ఎక్కడ ఎక్కువ కాలం ఆగలేదు. అయితే అడ్డంకి తొలగిపోయాక, యాకోబు ప్రయాణం చురుకుగా సాగలేదు.
పద్దనరాములోనుండి వచ్చి తరువాత కనాను దేశములోనున్న షెకెము ఊరికి అతడు తన గుడారములు వేసిన పొలముయొక్క భాగమును షెకెము తండ్రియైన హామోరు కుమారుల యొద్ద నూరు వరహాలకు కొనెను. ఆదికాండము 33:18-19. యాకోబును దేవుడు మధ్యలో ఆగిపొమ్మని దేవుడు చెప్పలేదు గాని , అతడు పుట్టిన దేశానికి వెళ్ళమని చెప్పాడు. ఆదికాండము 31:13 కానీ యాకోబు “షెకెము”అనే ఊరి ముందర గుడారాలు వేశాడు. తరువాత ఆ స్థలాన్ని హివ్వియుల రాజైన హామోరు వద్ద కొన్నాడు. తనకు స్థలాన్ని స్వస్థ్యంగా సంపాదించుకొన్నాడు. యాకోబు దేవుడు కోరుకొని స్థలంలో గుడారం వేశాడు కాబట్టి ఎంతో మనోవేదన అనుభవించాడు. అక్కడ వారు కాపురమున్నారు కాబట్టి దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. దేవుడు చెప్పని ప్రదేశములో ఆగిన యాకోబు తన కుమార్తె వలన అవమానమునకు గురి అయ్యాడు.
పెంపకంలో లోపం:-
ఒక్కతే కుమార్తె కావడము వలన దీనాను కుటుంబ సభ్యులు అంత చాలా ఎక్కువగా ప్రేమించారు. అందుచేత దీనాకు పనేమీ లేదేమో! పనంతా లేయనే చూసుకొనేదేమో! తీరిక ఎక్కువ వుంది కాబట్టి ఆమె ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. ఆదికాండము 34:1
ఎఫెసీయులకు 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
దేవుడు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాడు ప్రభువు శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి. కుమార్తెలను ప్రేమించటం తల్లిగా మన బాధ్యత,నిజమే! కానీ,అతిగా ప్రేమించటము అది వారికే మంచిది కాదు. వారు పని కలిగి ఉండాలి. వారి జీవితములో వారు ఒడిదుకులకు తట్టుకోవాలంటే కుమార్తెలను గృహ పనులను కూడా నేర్పించాలి. “చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము” అని సామెతలు 12:27
అనవసర విషయాలలో ఆసక్తి:-
దీనా ఆ దేశపు కుమార్తెలను చూడలని వెళ్ళింది. కనాను వారితో కలసి పోకూడదని. దేవుని ఆజ్ఞ . ఆ దేశస్తుల అలంకరణ , వస్త్రాలు,వారి ఆచారాలు ఈ విషయములలో ఆసక్తి ఎక్కువ పెరిగింది.నేత్రశకు లోబడింది. ఇలా చుసిన హవ్వను సాతాను మోసము చేసి దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తినే ల చేసింది. అనవసరమైన వాటిలో ఆసక్తి నష్టానికే దారి తీస్తుంది.
స్వేచ్ఛను కోరి నష్టము:-
దీనా తన కుటుంబంలోని తల్లిదండ్రుల, అన్నల తోడులేకుండానే ఆ దేశాన్ని,అక్కడి స్త్రీలను చూడవెళ్ళింది. ఆ దేశపు కకుమార్తె ల స్నేహము కోరి వెళ్ళింది.దీనా ఒంటరిగా వెళ్ళింది. తన భద్రత తాను చేసుకోగలను అని అనుకుంది. అందువల్ల తన జీవితాన్ని నష్టపరచుకొంది. దిశ అనే అమ్మాయి కూడా ఇలానే ఇంటి నుండి బయటకు వచ్చింది. ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ మెస్సుర్మెంట్ లేకుండా ఒంటరిగా వెళ్ళింది. తన భద్రత తాను చేసుకోగలను అని అనుకుంది. ఫలితము తన జీవితము లో జరగరాని కార్యములు జరిగాయి , దుష్టుల వలలో పడింది. అత్యంత కిరాతకంగా అత్యాచారము,సజీవదహనం చేసారు. కాబట్టి యవ్వన అమ్మయిలు మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. తలిదండ్రుల అన్నల,సహాయముతో మీ పనులను చేసుకోండి. ఒక వెల ఉద్యోగరీత్యా వేరే ప్రదేశములో మీరు ఉంటె అపరిచిత వ్యక్తులతో స్నేహము,వెళ్లకూడని ప్రదేశములు వెళ్లకుండా,సమయపాలనకలిగి ఉండాలి. సెక్యూరిటీగ ఎల్లప్పుడు మీ మొబైల్ లో పోలీస్ వారి నంబర్లు,ఫ్యామిలీ వారి నంబర్స్ ఆటోడైల్ మోడ్ లో ఎప్పుడు ఉంచు కోవాలి.ఈ రోజులలో కూడా అమ్మాయిల జీవితములలో జరుగుతుంది. కాబట్టి పాపమూ అనేది సృష్టి ఆరంభము నుండి ఉంది ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లపుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి; తాను భూమి మీద నరులను చేసినందుకు. యెహోవా సంతాపము నొందియున్నాననెను.
లొంగిపోయిన దీనా:-
“అతని మనస్సు యాకోబు కుమార్తె అయినా దీన మీదనే ఉంది. అతడు ఆ చిన్నదానితో ప్రేమగా ప్రీతిగా మాట్లాడి ” ఆదికాండము 34:3. దీన తన తల్లి అయినా లేయా భర్త ప్రేమకు తపించటము,ఆమె ఫై అది చాల ప్రభావము చూపింది. అందుకే తనను అవమానపరచిన షెకెమును ఆమె అస్యహించుకొనలేదు. ఇశ్రాయేలు ప్రజలలో అవమానమని,దేవుని నిబంధనకు నీచమైన పని అని దీనా గుర్తించలేదు. తన అన్నలు వచ్చి వీడిపించేంత వరకు దీనా షెకెము ఇంటిలో ఉంది.
అన్నలను హంతకులుగా మారుట:-
షేకేము తన తండ్రి ద్వారా యాకోబు తో వియ్యం కోరుకొన్నాడు. “అప్పుడు హామోరు వారిలో – షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె అయిన దీన మీదనే ఉన్నది. మీరు మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి”. షెకెము – మీ కటాక్షము మామీద రానీయుడి. మీరు అడిగినంత ఓలియును,కట్నమును ఎంతయైననుఅడుగుడి. మీరు అడిగినంత ఇచ్చెదను.మీరు ఆచిన్నదాని నాకు ఇయ్యుడని యాకోబుతోను, ఆమె సహోదరులతో చెప్పేను . అయితే దీనాకు జరిగిన అవమానమును బట్టి దీనా అన్నలకు బహు కోపము వచ్చింది ఎంతో బాదపడ్డరు. అందువల్ల వారు కపటముగా జవాబిచ్చారు.
ఆ ఊరి వారంతా సున్నతిపొందితే,వియ్యందటానికి తనకేమి అభ్యంతరము లేదని చెప్పారు. హమోరు,అతని కుమారుడు షెకెము ఊరి ప్రజలందరికీ నచ్చజెప్పి ప్రతి పురుషుడు సున్నతి పొందేలాగున ఒప్పించాడు. మూడురోజుల తరువాత వారంతా భాధ పడుతున్నపుడు దీన అన్నలైన లేవి, షిమ్యోను కత్తి పట్టు కొని ఊరి మీద పడి షేకమును ,హమోరును ఊరి లో ప్రతి పురుషుని చంపారు. నిర్గమకాండము 20:13 “నరహత్య చేయకూడదు ” దీనా అన్నలు “హంతకులు” అని ముద్ర పడింది. తమ చెల్లెలు చెరపట్ట బడి. అవమానపర్చబడిందని కోపంవల్ల హత్య చేయడానికి కూడా వెనుకాడలేదు
యాకోబు తన అవసానదశలో “లేవి, షిమ్యోను గురించి ఇలా అన్నాడు. “వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమ వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. దీనా తనకే కాదు , తన అన్నల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా మారింది.
నిర్దోషుల రక్తపాతం:-
దీనా చేసిన ఒక్క పొరపాటు వలన షెకెము పట్టణం మొత్తం నాశనమైంది. “తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారుల కోపానికి అమాయకులైన పురుషులు చంపబడరు. స్త్రీలు, పిల్లలు చెరపట్టబడారు. వారికీ కలిగి ఉన్నదంతయు దోచుకొనిరి. నిరపరాధుల రక్తం చిందింపబడింది. ఎంతో మంది స్త్రీలు ఒక్క రోజులోనే విధవరాలు అయ్యారు.
తల్లిదండ్రులు, అన్నలను గాయపరిచిన దీనా:-
ఆదికాండము 34:30 “మీరు నన్ను బాధ పెట్టి, యీ దేశనివాసులైన కనానీయుల,పేరిజ్జియులలో ను,అసహ్యులనుగా చేసితిరి. నా జనసంఖ్య కొంచమే. వారు నా మీదికి వచ్చి నన్ను చంపెదరు. నేనును , నా ఇంటి వారందరును నాశనమగుదుమని చెప్పను. “
ఈ సంఘటన వలన యాకోబు కు ప్రాణభయము పట్టుకుంది. వెంటనే దేవుడు చెప్పిన మాటకు లోబడి, భేతేలుకు ప్రయాణమైవెళ్ళాడు. యాకోబు తన ఇంటి వారందరితో కలసి కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళినప్పుడు దీనా తన ఇంటనే ఉంది. దీనా వల్ల లేయా తన చివరి దశలో ఎంతో మానసిక బాధ అనుభవించింది. దీనా జీవితము మనకందరికి హెచ్చరికగా వుంది.
1 కోరిందీయులకు 10:11 “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికీ సంభవించి, యుగాంతమందున్న మనకు బుధ్ది కలుగుటకై వ్రాయబడెను. సోదరి, సోదరులారా ! మన కుమారులు,కుమార్తెలు ఎలా వున్నారు?వారి ప్రవర్తన ఎలా వుంది? మన బిడ్డలను పాపము చేయకుండునట్లు వారి హృదయములో వాక్యము ఉంచగలిగితే మన వంతు బాధ్యత మన నెరవేర్చినవారమే. “యవ్వనస్థులు దేనిచేత తమ నడత శుద్ధి చేసికొందురు?
నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా ” కీర్తనలు 119:9
నేర్చుకుందాం:-
1.దేవుని చిత్తానుసారముగా జీవితమును కొనసాగించాలి.
2.ప్రతి విషయములో,ప్రతి నిర్ణయాలలో దేవునిపై ఆధారపడాలి.
3.తలిదండ్రులు పిల్లలను పెంచే విషయములో ప్రత్యేక శ్రద్ధవహించాలి.
4.అనవసరమైన కార్యకలాపాలు చేయకుండా చూసుకుందాము.
5.యవ్వన బిడ్డలను ఒంటరిగా వదల కూడదు. ఒంటరిగా బయటకు పంపించకూడదు.
6.పిల్లలప్రవర్తనలో వచ్చే ప్రతి చిన్న మార్పు గుర్తించి అది మంచిది అయితే ప్రోత్సహపరచాలి లేనిచో దానిని వలన వచ్చే పర్యవసానాలను ప్రేమతో వివరింస్తూచెప్పాలి.
7.మన పిల్లల్ని దైవికముగా పెంచాలి
8.అతి గారాబం వలన మన పిల్లల భవిష్యత్తును పాడుచేయకుండా కాపాడుకొందాము.
Leave a Reply