PRAYERTOTHEWORLD

POWER OF PRAYER

మాసపత్రిక -జనవరి 2025

PRAYER TO THE WORLD

                     POWER OF PRAYER

INDEX

  • 2025 నూతన సంవత్సరములో నీలో, నీజీవితములో దేవుడు అద్భుతములను చేసే సంవత్సరము.
  • మిషనరీ బయోగ్రఫీ
  • స్త్రీ పాత్ర
  • ఒక సంవత్సరములో బైబిల్ కంప్లీట్ చెయ్యాలి అంటే జనవరి నెలలో చదవలసిన అధ్యాయములు మీద క్విజ్ మరియు పజిల్
  • పిల్లల కధలు 

జాన్ వెస్లీ :-

జాన్ వెస్లీ

* గొప్ప ఉజ్జివ కర్త, మెథడిస్టు సంఘ స్థాపకుడు. 

*జాన్ వెస్లీ 1703 వ సంవత్సరమున ఇంగ్లాండులో జన్మించెను. 

*”లోకమే నా సేవ స్థలం” అన్న విశాల హృదయుడు. 

*జాన్ వెస్లీ ప్రభువు సేవార్ధము 2500000 మైళ్ళు గుఱ్ఱముపై ప్రయాణించి సువార్తను అందించెను.

*తన 49 సంవత్సరమున సేవలో ప్రయాణించిన దూరము సరాసరి లెక్క చెప్పున రోజుకు 20 మైళ్ళు. సంవత్సరానికి 8000 మైళ్ళు. 

*జాన్ వెస్లీ  గారు సంవత్సరమునకు 5000 సార్లు ప్రసంగించెను. 

*అనేక సార్లు ఈయన మీటింగుల్లో 20,000 మంది జనముండేవారు. 

ఈయన సువార్త కొరకై 30,000  డాలర్లు తన సొంత ధన నిధిలో నుండి వాడేను. 

*40,000 ప్రసంగాలు ఈయన వ్ర్రాసి తయారు చేసెను. 

*ఈయన పది భాషలు నేర్చుకొనెను.

*ఈయన ప్రతిరోజు ఉదయము 4 గంటలకు లేచి 5 గంటల కల్లా ప్రసంగించడం మొదలు పెట్టెడి వాడు. 

*”ప్రభువా! నీకొరకు కాళీ పోనీ గాని నన్ను తుప్పు పట్టనివ్వద్దు. 

నిష్ప్రయోజన జీవితముజీవింపనియ్యవద్దు “అని మట్టిమట్టికి ప్రార్ధించెడివాడు. 

*తన 83వ యేట “దినమునకు 15 గంటల కంటె ఎక్కువ వ్రాయలేక పోతిని అని చింతించెనట. 

*తన 86వ యేట “దినమునకు రెండు సార్లు కంటె ఎక్కువ ప్రసంగం చేయలేక పోతున్నానే” అని సిగ్గుపడెనట. 

*ఉదయము 5:30 గంటల వరకు పండుకోవాలనే ఆశ తన 86 వ సంవత్సరమున కలుగుతున్నదని బాధపడి తన డైరీలో వ్రాసుకున్నాడు. 

అనేక వేల ఆత్మలను సంపాదించిన తరువాత రష్యాలో సేవ చేస్తుండగా వచ్చిన తీవ్రమైన జ్వరము వలన మార్చి 2-1791 వ సంవత్సరములో తన 88వ యేట ప్రభువునందు నిద్రించెను. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *