PRAYERTOTHEWORLD

POWER OF PRAYER

జవాబు తెచ్చే- ప్రార్ధన నియమాలు

జవాబు తెచ్చే

– ప్రార్ధన నియమాలు

1.         1. పరిచయం

2.        2. ప్రార్ధన నియమాలూ

3.        3. ప్రార్ధన చేయువిధానము

4.         4..ప్రార్ధన – ప్రవచనం

5.         5. జవాబు తెచ్చ  ప్రార్ధన 

  • పరిచయం:-

దానియేలు ప్రార్ధనలు మనము 9 అధ్యాయములో 1 నుoడి 21 వచనముల వరకు ప్రార్ధన 22 నుoడి 26 వచనముల వరకు 70 వారాల  ప్రవచనం

దానియేలు ప్రార్ధన మాదిరి కరమైన ప్రార్థన. ప్రార్ధనలో నిర్దిష్టమైన లక్ష్యము గురి  ఉండాలి. ప్రార్ధనలో యధార్ధమైన  పశ్చాత్తాపము  ఉండాలి. దానియేలు బలమైన విజ్ఞాపన చేశాడు. అది దర్యావేషు పాలనలో మొదటి సంవత్సరం దర్యావేషు మదీయుడు యితనిని చరిత్రలో 2వ సయోజరస్   అని వ్యవహరిస్తారు.

ఇతడు బబులోను క్రీ.పూ538 సంవత్సరములో జయించాడు దర్యావేషు అంటె పేరు కాదు అది బిరుదు. దానియేలు చుస్తువుoడగానే ఒక రాజ్యం అంతరించింది మరొక గొప్ప రాజ్యం లేచింది . తన ప్రజల భవిష్యత్తు ఏమిటి అని అతనికి భయాందోళన లో ఉండగానే అప్పుడతడు వాక్యమును చదువసాగాడు.

అతను యిర్మీయా గ్రoధమును చదువుతున్నాడు.70సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉంటారు. క్రి.పూ. 537 సంవత్సరములో దానియేలు ఇంచుమించు 90 సంవత్సరాలు.  క్రీ.పూ.606 సంవత్సరములో దానియేలూ ఒక యువకుడుగా చెరలోనికి వచ్చాడు అప్పటికి అతని వయస్సు 17 సంవత్సరాలు.

70 సంవత్సరాల గడువు తీరిపోయిoది. వీరు స్వదేశానికి వెళ్ళిపోతారు . దానియేలు తన ప్రజల భవిష్యత్తు గురించి ఎంతో కంగారుపడ్డడు

ప్రార్ధన నియమము :-

మత్తయి 6:7-. మీరు ప్రార్ధన చేయునప్పుడు. అన్య జనులవలె వ్యర్ధమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు . 

ప్రభువు మనకు ప్రార్ధన నియమమును నేర్పుతున్నాడు. వ్యర్ధమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వద్దు అది దేవుని దృష్టిలో ప్రార్థన కానే  కాదు.  దానియేలు ఉపవాసం వున్నాడు. నెత్తిన ధూళి  పోసుకున్నాడు. ఇది ప్రదర్శన కాదు.  దేవునీ సన్నిధిలో పై వేషాలు నిలువవు. వ్యక్తిగతముగా తాను ప్రార్ధన చేస్తూ తన జాతి పక్షమున తాను ప్రార్ధిస్తూ తనను తన జాతి తో సంయుక్త పరచుకొన్నాడు అపుడపుడు లాంఛనా ప్రాయముగా ప్రార్ధిoచే మనిషి కాదు ప్రార్ధన అంటె ఏదో కంఠతా చేసింది యాంత్రికంగా వల్లించడం కాదు .

ప్రార్ధనలో దానియేలు తన పాపమును ఒప్పుకున్నాడు, ప్రార్ధనలో  డొంకతిరుగుడు బాషా పనికిరాదు పారదర్శకత’ ఎంతో అవసరం దేవుని  కన్నులకు మరుగు అయినది ఏది లేదు కదా!

ప్రార్ధన చేయువిధానము:-

దానియేలు చేసిన ప్రార్ధనలో మనకు ఎన్నో అoశాలు భోధపడతాయి . విరిగిన నలిగిన హృదయముతో గోనే పట్ట కట్టుకున్నాడు దానికి గుర్తు ప్రగాఢమై పశ్యతాపముతో ధూళి తలపై పోసుకున్నాడు మనసు నిబ్బరము చేసుకొన్నాడు . ప్రార్ధన , విజ్ఞాపన ,ఉపవాసము చేశాడు.  ఉపవాసము ఉండాలి అంటె ఈరోజులలో చాలా కష్టతరము. యేసుప్రభువు ఉపవాసము ఉన్నాడు. విశ్వసులకు ఉపవాసము ఉండాలి అనేది కృపా దృక్పధంలో ఆజ్ఞకాదు. ఐచ్చికం ఉపవాసం  స్వచ్ఛందంగా చేస్తే కృప అవుతుంది లేకపోతే ధర్మ శాస్త్రము అవుతుంది ఆదిమ సంఘంలో విశ్వాసులు అందరు  ఉపవాసం ఉన్నారు అది స్వచ్ఛందం  విశ్వాసులు చేయవలసిన దానికంటె ఏక్కువ చేస్తారు ఇవ్వవలసిన దానికంటె ఏక్కువ ఇస్తారు.

2వ కోరింథీయులు 11:27:-  “ప్రయాసముతో , కష్టముతోను , తరచుగా ఉపవాసములతోను ,చలితోను , దిగంబరత్వముతోను ఉంటిని” అని పౌలు అన్నాడు. దానియేలు ప్రార్ధన జీవితములో ప్రార్ధన ప్రధమ స్థానంలో ఉంది ఎడతెగని ప్రార్ధన తప్పనిసరి గా చేయాలి . ఇది బలవంతం, ఒత్తిడి కాదు. అది స్వచ్ఛంద ప్రార్ధన

ఆదికాండము 32:26:- “ఆయన – తెల్లవారుచున్నది గనుక న్నను పోనిమ్మనగా అతడు -నీవు నన్ను ఆశీర్వదిoతేనే గాని నిన్ను పోనియ్యను .”

 యాకోబు ప్రార్ధన ఒక ఆక్రందన . దానియేలు చేసిన ఈ ప్రార్ధన తన వ్యక్తిగతం తన గురించి తన ప్రజల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు . నేను ,మేము , మనము అంటు తనను , తన జాతిని కలుపుకుంటూ ప్రార్ధన చేస్తున్నాడు దైవసేవకులు , ప్రవక్తలు చేసిన ప్రభోధలను పెడచెవిని పెట్టారు . దేవునికి ఏదురుతిరిగారు తిరుగుబాటు చేశారు . దేవుని స్వరమును నిర్లక్ష్యపెట్టారు  దేవునికి ధర్మశాస్త్రనిన్ని మీరారు. దానియేలు యూదా వారి కోసం ప్రార్ధించాడు మిగతా 10 గోత్రాలు యూదా కంటె ముందుగా 133 సంవత్సరముల క్రిందట అషూరు చేత చెరగొని పోబడ్డారు ఆయా ప్రాంతములలో చెదరిపోయిన తన ప్రజలందరికోసం దానియేలు ప్రార్థించాడు.

జవాబు తెచ్చ  ప్రార్ధన:-

దానియేలు ప్రార్థింస్తూoడగానే అతని ప్రార్ధనకు దేవుడు అతనికి జవాబు ఇచ్చాడు.

1యోహాను 5:14:- ఆయనను  బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను నదియే.

దానియేలు ప్రార్థిస్తూ ఉండగానే గబ్రియేలు దూతా వచ్చి దానియేలు దేవుని చిత్తమును బయలుపరచాడు అది బహిరంగ ప్రార్ధన సమావేశము కాదు అది వ్యక్తిగత ప్రార్ధన సమయము దానియేలు ముడే మూడు నిముషాలు దానియేలు చేసిన ప్రార్ధనకు వెంటనే సమాధానము వచ్చింది.

దానియేలు ప్రార్ధన వేగవంతమై పరలోక ప్రదేశాలలో చచొచ్చుకొని పోయి దేవుని సింహాసనము సమీపించింది.

దూరదర్శినిలో నక్షత్రాలను చూడడంకాదు  ప్రార్ధన రెక్కలతో ఆకాశమహాకాశల పైకి దేవుని సింహాసనం వద్దకు ఎగిరిపోగలము. దానియేలు ప్రార్ధన అనేది ఒక ఆచారక్రియ కాదు ఆధ్యాత్మిక అనుభూతి అంటారు .ప్రార్ధనకు ఎంతో దీర్ఘశాంతముకావలి , దీక్ష కావాలి , విశ్వసము కావలి.

ప్రార్ధన – ప్రవచనం:-

దేవుని వాక్యము దేవుని చిత్తమును బయలు పరుస్తుంది దేవుని వాక్యమును ఆధ్యానం చేసి ప్రార్థిoచే వారికీ దేవుని చిత్తము బయలుపడుతుంది . ఇoతకు యిర్మీయా గ్రంధములో దానియేలు చదివిన ప్రవచనాలు ఏవి ; ధ్యానించిన సత్యము ఏమీటి ?

యిర్మీయా 25:11:- ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ; ఈ జనులు డెబ్బదిసంవత్సరములు      బబులోను రాజునకు దాసులుగా ఉందురు  మీరు మీరు మీరు ప్రార్ధన చేయునప్పుడు మీరు ప్రార్ధన

యిర్మీయా 29:10:-  యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు -బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నేరవేర్చిన  యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించు నట్లు నేను మిమ్మును దర్శింతును 

70 ఏళ్ల ప్రవచనం దృష్టికి ఈ ప్రవచనం ఆకర్షించింది గాబ్రియేలు 70 వారాలు అనగా 70 సంవత్సరాలు అని ఇశ్రాయేలు శ్రమలకాలమంతా ,తదుపరి భూమిపై యేసయ్య రాజ్యము స్థాపించడబోయే వరకు ఈ కాలమే  అని గుర్తించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *