PRAYERTOTHEWORLD

POWER OF PRAYER

2025 నూతన సంవత్సరములో నీలో, నీజీవితములో దేవుడు అద్భుతములను చేసే సంవత్సరము.

2025 నూతన సంవత్సరములో నీలో, నీజీవితములో దేవుడు అద్భుతములను చేసే సంవత్సరము.

2025 నూతన సంవత్సరములో నీలో, నీజీవితములో దేవుడు అద్భుతములను చేసే సంవత్సరము.

క్రీస్తులో అద్భుతమైన సంవత్సరము 2025:-

1. ఈరోజునే క్రొత్త ఆరంభాన్ని ప్రారంభిద్దాము:-

పూర్తిగా ఓడిపోయిన తప్పిపోయిన కుమారునికి తండ్రి ప్రశస్తమైన వస్త్రమును తెచ్చి తొడిగించారు. ఇదియే సువార్త యొక్క సందేశము. తప్పిపోయిన వారికీ కూడా దేవుడు అతిశ్రేష్ఠమైన వాటిని,శోధింపశక్యంకాని ఐశ్వర్యమును ఇస్తాడు. దేవుడు ఎవరి విషయములోనైనను నిరాశపడడు  లేక వారిని ఎన్నటికిని విడివడు కాబట్టి వారు క్రొత్త ఆరంభాన్ని ప్రాంభించవచ్చును. గత సంవత్సరములో తప్పిపోయిన నీవు ఎటువంటి తప్పిదములు చేసినప్పటికిని, ఇప్పుడు దేవునితో నీవు క్రొత్త ఆరంభాన్ని ప్రాంభించవచ్చును. నీవు వేయ్యిసార్లు తీర్మానాలు తీసుకోని ఆరంభించవచ్చును. అయినప్పటికీ నీ జీవితములో మన అవసరమంతటికి చాలిన దేవుడు అద్భుతకార్యము చేయగలడు. ఇప్పటివరకు నీవు అసాధ్యమనుకున్న వాటిని దేవుడు నీలో చేయగలడని దృఢముగా ఆయనను విశ్వసించి మరియు ఆయనను నమ్ముము. రోమా 4:21

2. దేవుని వాగ్దానములన్నిటిని స్వతంత్రించుకోవాలి:-

ప్రతి రోజు నీవు దేవుని వాగ్దానములను విశ్వసించి వాటిని ప్రార్ధన చేసి స్వతంత్రించుకున్నట్లయితె గత సంవత్సరములన్నిటికంటె ఈ సంవత్సరము చాల మంచిదిగా ఉంటుంది. ఇశ్రాయేలీయులందరిని కనాను దేశానికి తీసుకువెళతానని దేవుడు వాగ్దానము చేశాడు . నిర్గమకాండము 3:17

యెహోషువ మరియు కాలేబు మాత్రమే దానిని విశ్వసించిన దానంతటిని, నీ   నోటితో ఒప్పుకొంటూ ఉండాలి రోమా 10:8,9

ఎక్కడ ఎనిమిది వాగ్దానములు ఉన్నవి. నీవు వాటిని హృదయములో విశ్వసించి మరియు నోటితో ఒప్పుకొంటూ వాటిని ప్రార్ధనగా చేయుచు ఈ సంవత్సరము వాటిని స్వతంత్రించుకొనుము. 

a)నేను ఎల్లప్పుడు ఆనందించెదను యోహాను 17:23

b)నేరారోపణలో జీవించను -1యోహాను 1:9,హెబ్రీయులకు 8:12

c)దేవుడు నన్ను ఎల్లప్పుడు పరిశుద్ధాత్మతో నింపును కాబట్టి ఎటువంటి పని,కార్యమునైనను చేయుటకు కావాల్సినంత శక్తిని కలియుండుదును.

లూకా 11:13

d)దేవుడు నా యొక్క సరిహద్దులన్నిటిని,నివాసస్థలము యొక్క పొలిమేరలను నిర్ణయయించియున్నాడు. -కాబట్టి నేనుఎల్లప్పుడు సంతృప్తి కలిగి యుందును  అపోస్తులకార్యములు 17:26,27,

హెబ్రీయులకు 13:5

e)దేవుని ఆజ్ఞలన్నియు కేవలము నా మేలుకొరకే మాత్రమే ఉన్నవి-కాబట్టి వాటన్నిటికీ విదేయత చూపించాలని కోరుచున్నాను. 1 యోహాను 5:3,ద్వితీయోపదేశ్ కాండము 10:13

f)నన్ను ప్రభావితము చేసే నేను ఎదుర్కొనే ప్రతి వ్యక్తియు మరియు ప్రతి పరిస్థితి కూడా దేవుని ఆధీనములో ఉన్నవి – కాబట్టి సమస్తమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను రోమా 8:28,ఎఫెసీ 5:20,1థెస్సలొనీకలు 5:18

g)ప్రభువైన యేసు సాతానును నశింపజేసి మరియు సాతాను నుండి నన్ను విడిపించియున్నాడు-కాబట్టి నేను ఎన్నటెన్నటికి భయపడను – హెబ్రీయులకు 2:14,15;13:6

h)దేవుడు నన్ను ఆశీర్వాదముగా చేయాలనీ కోరుచున్నాడు – కాబట్టి నేను ఇతరులకు ఆశీర్వాదముగా ఉందును-అపొస్తులకార్యములు 12:2,గలతీయులకు 3:14

ఇతరుల యెడల కనికరము కలిగియుండుము:-  దేవుడు  నీ యెడల ఎంత కనికరము చూపించియున్నాడో, దానిని ఈ సంవత్సరములో ఎప్పుడైనను మరువవద్దు. అలాగే ఇతరుల యెడల కనికరము కలిగియుండుము. ప్రభువు యొద్ద నుండి నీవు ఎంతో సమృద్ధిగా,ఉచితముగా పొందుకొని యున్నావు.అలాగే నివి కూడా ఇవ్వగలిగిన దానిని ఉచితముగా ఇవ్వుము మత్తయి 10:8. ఏ విధముగానైనను నీకు రుణపడియున్నవారిని లేక నిన్ను గాయపరిచిన వారిని లేక కీడు చేసినవారిని క్షమించుము.గత కక్షలన్నిటిని భూస్థాపితము చేయుము మరియు అందరియెడల కనికరము కలిగి ఈ రోజు ఒక నూతన ఆరంభాన్ని ప్రారంభిచుము. 

ప్రతిరోజు ఆత్మలో జీవించుము:- అపోస్తులుడైన యోహాను “ఆత్మలో” ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని బూరధ్వని వంటి గొప్ప స్వరాన్ని విన్నాడు ప్రకటన 1:10. నీవు కూడా ఈ సంవత్సరమంతయు ఆత్మలో జీవించినట్లయితె నిన్ను ఎల్లప్పుడు ప్రోత్సహించి,నడిపించే ప్రభువు స్వరాన్ని బూరధ్వనివంటి శబ్దము వలె వినెదవు. పాపము విషయములో సున్నితముగా ఉండి మరియు దేవుని యెదుట దీనులమైన ఎల్లప్పుడు దేవుడు మనకెంత అవసరమో ఎరిగియుండి ప్రతిరోజు ఆత్మ పూర్ణులముగా ఉండాలి. 

దేవునిని ఆరాధించే వాడుగా ఉండుము:- దేవుడు ముఖ్యముగా ఆయనను ఆరాధించేవారిని కోరుచున్నాడు అనగా ఆయనను మాత్రమే కోరుకొనుట.అప్పుడు యెషయా చూచినట్లు నీవు కూడా దేవుని మహిమను చూచెదవు. వెంటనే యెషయా తన యొక్క సొంత పాపమును చూచాడు. అలాగే నీవు కూడా చూచెదవు యెషయా 6:1-5. దేవునిని ఆరాధించేవాడుగా ఉండుము అప్పుడు దేవుడు నీ జీవితములో ఏ విషయాలలో నీవు క్రీస్తులాగా లేవో బయలుపరుస్తాడు. అట్టివాటి నుండి మనము పరిశుద్ధపరచబడాలి. ఆవిధముగా ఈ సంవత్సరములో ప్రతిదినము కొంచెము కొంచెము ఆయన స్వభావములో నీవు పాలివాడవగునట్లు దేవుడు చేస్తాడు. 

ఈ సంవత్సరము ప్రభువు నిన్ను ఇతరులకు ఆశీర్వాదముగా చేస్తాడని నమ్ముము:-

దేవుడు అబ్రాహాముతో “నేను నిన్ను ఆశీర్వదించి… భూలోక వంశములన్నియు నీ యందు ఆశీర్వదించబడునట్లు చేసెదనని చెప్పారు.”ఆదికాండము 12:2,3. ఈ ఆశీర్వాదమును పరిశుద్దాత్మ ద్వారా ఇప్పుడు మనము స్వతంత్రిచుకొనవచ్చును గలతి 3:13,14. నీ గిన్నె నిండి పొర్లి ఇతరులలోకి పారి జీవ సరఫరా జరిగి అనేకులు ఆశీర్వదించబడునట్లు, దేవుడు నిన్ను తైలము పరిశుద్దాత్మతో అభిషేకించాలని కోరుచున్నాడు. ఎలీషా కాలములో,బీద విధవరాలి పాత్ర నూనెతో నింపబడియుండగా,ఆమె ఇరుగుపొరుగు వారి పాత్రలన్నిటిలో ఆ నూనెపోసి వాటిని నింపెను 2 రాజులూ 4:1-7. 

ఈ సంవత్సరములో నిన్ను కలిసే ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించుటకు అవసరమైన దానికంటె ఎక్కువ దేవుని శక్తిని మరియు ఆశీర్వాదమును పొందునట్లు దేవుడు నిన్ను అభిషేకించును. ఆ విధవరాలు ఇతరులను ఆశీర్వదించునట్లు,నీవును ఇతరులను ఆశీర్వదించెదవు. కాబట్టి నీలోనుండి జీవ జలనదులు అనేకులలోనికి ప్రవహించునట్లు చేయును. కాని దేవుని ఆశీర్వాదమును నీకొరకే ఉంచుకొనినయెడల,మన్నాను రాత్రికూడా ఉంచితె ఎలా కంపు కొడుతుందో అలాగే జరుగుతుంది. ఇతరులకు నీళ్లు పోయువారికి దేవుడు నీళ్లు పోయును. సామెతలు 11:25 అది నీ జీవితములో జరుగును గాక. 

ఈ సంవత్సరము క్రీస్తును కలిగిన అటువంటి జీవితము కలిగియుందుముగాక,ఆమెన్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *