పరిశీలించుకొనవలసిన అంశములు:-
1. దేవుని చిత్తము నా జీవితములో నెరవేరాలని నేను నిజముగా ఆశిస్తున్నావా?
2.నేను ప్రార్ధన చేస్తున్నప్పుడు ఆయన మహిమ కోసం చేస్తున్నావా? లేదా నా సంతోషము కోసమా?
3. దేవునిని వ్యతిరేకించే అంశములు నా జీవితములో ఏదన్నా ఉన్నదా?
4. నా అంతరాత్మలో ఇంతవరకు ఒప్పుకుకొని పాపము ఏదైనా దాచి పెట్టుకొని ఉన్నదా?
5. నా అంతటా నేను కావాలనే దేవునికి నన్ను నేను లోపరచుకుంటున్నానా?
ఆయన వాక్యానికి లోబడి దాని ప్రకారము నడచుకుంటున్నానా ?
6. దేవుని వాక్యపు హెచ్చరికలకు నేను అందుబాటులో ఉన్నానా ? ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రతి దినము వాక్యాన్ని ధ్యానిస్తున్నానా?
7. నా హృద్యము నా ఫై ఈ విషయాలను గూర్చి దోషారోపణ చేస్తే ఆయన పరిశుద్ధాత్మ చేత వాక్యము ద్వారా ఆయన మనస్సుకు ఏయే విషయాల్లో విరోధముగా ఉన్నదో చూపించినపుడు నిజాయితీగా నేను స్వపరిక్ష చేసుకుంటున్నానా?
8. దేవుని మార్గములో ఎంత ఖచ్చితముగా ఉంటారో అంతే ఖచ్చితముగా శోధనలు ఎదురు అవుతాయి! శోధనలు ధైర్యముగా ఎదురుకొంటున్నావా ? లేదా శోధనలను చూచి ఇంకా ఆత్మీయముగా దిగజారిపోతున్నావా?
9.మన జీవితములో కొందరు వ్యక్తులు కొన్ని పాఠాలు నేర్పిస్తుంటారు.కొన్ని సందర్భాలు ,వ్యక్తుకులు తీపి జ్ఞాపకాలను మిగుల్చుతారు కొందరు చేదు అనుభవాలు. చేదు అనుభవాలనుండి కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్చుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతున్నావా? అక్కడే ఆ చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆత్మనూన్యతాను అనుభవిస్తున్నావా?
10. ఈ లోకములో మీరు దేవునితో కూడా నడచుటలో మీ హృదయము మిమ్మును మోసగించకుండా జాగ్రత్త వహిస్తూ దాని పట్ల అప్రమత్తముగా ఉన్నావా?
11. కపట సహోదరుల పొగడత్తల విషయములో జాగ్రత్తగా వున్నావా?
12.మీ జీవితములో యధార్ధతను మరియు యదార్థత యొక్క శక్తిని కాపాడుకొంటున్నావా?
13.దృశ్యమైన వాటి కంటె అదృశ్యమైన వాటి యెడల ఆసక్తి కలిగియున్నావా?
14. చిన్నచిన్న పాపముల విషయములలో జాగురూకతను వహిస్తున్నావా?
15. దేవుని వాగ్దానముల పట్ల మీ హృదయమందు అత్యాసక్తి కలిగియున్నవా?
16. యేసుక్రీస్తు రక్తములో మీ విశ్వాసక్రియలు పునరుజీవింప జేసుకొనుచున్నావా?
17.మీ తరములో భక్తి గలవారితో కూడా ముందు వరుసలో నడచుటకు తీర్మానించుకొంటున్నావా?
18.దేవుడు ఇచ్చిన ఆశీర్వాదములతో తృప్త్తిగా నీ జీవితమును ను కొనసాగిస్తున్నావా?
19. దేవుడు నీ కనుగ్రహించిన నీ సమయమును ఎలా ఉపయోగిస్తున్నావు?
20. ఈ నూతన సంవత్సరములో అడుగు పెడుతున్న నాకు దేవుని తోడు మెండుగా కావాలి అని ఏయే విషయములలో సిద్ద పాటును దయచేయమని కోరుకొంటున్నావా?
ఈ ఒక్క రోజు మాత్రమే కాదు అనుదినము మనలను పరీక్షించుకోవాలి.
దేవుని యొక్క కృప మీకు తోడై యుండునుగాక!
Leave a Reply